: గుంటూరు జిల్లాలో రౌడీషీటర్ దారుణ హత్య... తెనాలి గంగానమ్మపేట సెంటర్ లో ఘటన


గుంటూరు జిల్లాలో నేటి ఉదయం దారుణ హత్య చోటుచేసుకుంది. ప్రజలంతా చూస్తుండగానే గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని నరికి చంపారు. దీంతో బాధితుడు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడిని రౌడీ షీటర్ మస్తాన్ గా పోలీసులు గుర్తించారు. తెనాలి గంగానమ్మపేట సెంటర్ లో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. భార్యను హత్య చేసిన కేసుతో పాటు పలు ఇతర కేసులు ఇతనిపై ఉన్నట్టు సమాచారం. నడిరోడ్డుపై హత్య జరగడంతో అక్కడి ప్రజలు భయాందోళనలతో పరుగులు పెట్టారు.

  • Loading...

More Telugu News