: స్మగ్లర్ గంగిరెడ్డి అరెస్టు
స్మగ్లర్ గంగిరెడ్డిని ఇంటర్ పోల్ అధికారులు అరెస్టు చేశారు. మారిషస్ నుంచి శ్రీలంక వెళ్తున్న గంగరెడ్డిని మారిషస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిపై ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గంగిరెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే, అవి ఫలించకపోవడంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. పోలీసుల ఆనుపానులు తెలుసుకున్న గంగిరెడ్డి స్థావరం మార్చేందుకు ప్రయత్నించడంతో అడ్డంగా బుక్కయ్యాడు. గంగిరెడ్డి పట్టుబడడంతో ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక ఉండే పెద్ద తలకాయలు పట్టుబడే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.