: అవినీతి సహించనన్నారుగా?...మరి వారిద్దరి సంగతి ఏంటి?: రేవంత్ రెడ్డి


అవినీతిని సహించేది లేదని, అవినీతి పట్ల హిట్లర్ లా వ్యవహరిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో పేర్కొన్న సంగతిని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ చెప్పిందే నిజమైతే మంత్రి హరీష్ రావు శాఖలో అవినీతి గుట్టలు గుట్టలుగా పేరుకుందని అన్నారు. అలాగే మరోమంత్రి జగదీష్ రెడ్డిపై పొన్నం తీవ్ర ఆరోపణలు చేసిన విషయం కూడా గుర్తు చేశారు. తన సహచరుల అవినీతిపై కేసీఆర్ చర్యలు తీసుకుంటారా? అని అడిగారు. హరీష్ రావుపై ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చెప్పాలని ఆయన నిలదీశారు. జగదీష్ రెడ్డిపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆయనకు కేసీఆర్ ప్రమోషన్ ఇచ్చారని రేవంత్ ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News