: ఏపీకి ప్రత్యేక హోదాపై పవన్ కల్యాణ్ స్పందన


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై బీజేపీ ఇంతవరకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంపై జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ తొలిసారి స్పందించారు. బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన సమయం ఆసన్నమైందని ట్విట్టర్ లో పవన్ పేర్కొన్నారు. మద్దతిచ్చిన, నమ్మినవారి ఆశయాలకు ఆ పార్టీ దూరంగా ఉండదని తాను ఆశిస్తున్నానన్నారు. ఏపీ విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు బీజేపీ కూడా అంగీకరించిందన్న విషయాన్ని పవన్ గుర్తు చేశారు. గతేడాది రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో కాంగ్రెస్, బీజేపీ మద్దతుతో అస్తవ్యస్త పద్ధతిలో ఆమోదం పొందిందని పవన్ పోస్టు చేశారు.

  • Loading...

More Telugu News