: ఏపీలో నూతన భవన నిర్మాణాలకు కొత్త నిబంధనలు
ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా భవన నిర్మాణాలు చేపట్టే వారికి ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. పర్యావరణ పరిరక్షణకు హరిత నగరాలను రూపొందించాలని నిర్ణయించింది. నూతన నిర్మాణాల్లో 75 శాతం హరితంగా ఉండాలని, 50 శాతం సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ తప్పనిసరని స్పష్టం చేసింది. ఇక వర్షపు నీటి సంరక్షణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలన్న నిబంధన తీసుకొచ్చింది. ఇలా మొత్తం 11 నిబంధనలను ప్రభుత్వం సవరించింది. నిబంధనలకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.