: రాక్షస రాజకీయం చేసింది రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్ లే: గాలి ముద్దుకృష్ణమ నాయుడు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుది రాక్షసపాలన అంటూ వైకాపా అధినేత జగన్ ఆరోపించడంపై టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మండిపడ్డారు. నిజానికి రాక్షస పాలన చేసింది వైయస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తండ్రి రాజారెడ్డి, ఆయన కుమారుడు జగన్ లే అంటూ ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్న వైకాపా నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సింది పోయి, బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తన వెనుక జనం లేకపోయినప్పటికీ, ఉన్నట్టు చూపించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎప్పుడు జైలుకు వెళతారో జగన్ కే తెలియని పరిస్థితి నెలకొందని, అందుకే జనాలను నమ్మించడానికి యాత్రలు చేపడుతున్నారని ఎద్దేవా చేశారు.