: ఆరు గంటలకు బీజేపీ నేతల సమావేశం
ఢిల్లీలో ఈ సాయంత్రం ఆరు గంటలకు బీజేపీ నేతలు సమావేశం కానున్నారు. భూసేకరణ బిల్లు ఆమోదం, జమ్ము కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే భూసేకరణపై తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను పార్టీలన్నీ వ్యతిరేకిస్తుండటంతో ఆ బిల్లును పార్లమెంటులో ఎలా ఆమోదింపజేసుకోవాలన్న విషయంపై ప్రధానంగా సమీక్షించనున్నారు. ఇక జమ్ము కాశ్మీర్ లో త్వరలో పీడీపీ-బీజేపీలు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సంగతి విదితమే. దీనిపైన ఓసారి ఈ సమావేశంలో ముందుగా మాట్లాడుకోనున్నారు.