: మెల్ బోర్న్ మైదానంలో రోశయ్య మనవడు, దగ్గుబాటి అల్లుడు
వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన పోరును ప్రత్యక్షంగా తిలకించేందుకు ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు రాజకీయ నేతల వారసులు మెల్ బోర్న్ వెళ్లారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య మనవడు మౌర్య, ఒంగోలు ఎంఎల్ఏ దామచర్ల జనార్దన్ సోదరుడు సత్యనారాయణ, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అల్లుడు అరుణ్, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సోదరుడి కుమారుడు జీవన్ తదితరులు ఈ మ్యాచ్ తిలకించేందుకు ఆస్ట్రేలియా వెళ్లారు. శిఖర్ ధావన్ సెంచరీ, రహానే మెరుపులు చూస్తూ సందడి చేశారు. భారత జట్టుకు అభినందనలు తెలుపుతూ, ప్రపంచ కప్ ను నిలబెట్టుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశారు.