: తుళ్ళూరులో వైకాపా బృందాన్ని అడ్డుకున్న రైతులు... ఉద్రిక్తత!
నవ్యాంధ్ర నూతన రాజధాని ప్రాంతంలోని తుళ్ళూరులో పర్యటనకు వెళ్ళిన వైకాపా బృందానికి చుక్కెదురైంది. ఆ ప్రాంతంలోని తెలుగుదేశం వర్గానికి చెందిన రైతులు వైకాపా బృందాన్ని అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో వైకాపా అనుకూల, వ్యతిరేక రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. రైతుల పరస్పర నినాదాలు పరిధులు దాటడంతో, అక్కడే ఉన్న పోలీసులు కల్పించుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం పోలీసుల రక్షణ మధ్య నేతల పర్యటన కొనసాగుతోంది. ఈ విషయమై మరింత సమాచారం తెలియాల్సివుంది.