: మహారాష్ట్రలో సీఎం మాత్రమే మారారు... వ్యవస్థ అలాగే ఉంది: ఫడ్నవీస్ పై శివసేన సెటైర్లు
నిన్నటిదాకా ప్రధాని మోదీ, బీజేపీ అధినాయకత్వంపై విడతలవారీగా విరుచుకుపడిన శివసేన, తాజాగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పై విమర్శలు గుప్పించింది. ‘‘మహారాష్ట్ర లో సీఎం మాత్రమే మారారు. వ్యవస్థలో ఏమాత్రం మార్పులేదు’’ అంటూ తనదైన శైలిలో సెటైర్లు విసిరింది. తన సొంత పత్రిక సామ్నాలో నేటి సంపాదకీయంలో ఆ పార్టీ పదునైన విమర్శలను సుతిమెత్తగా సంధించింది. ‘‘ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఏమైనా మార్పు కనిపించిందా? అయితే ప్లీజ్, అదేంటో మాకు కూడా చెప్పండి’’ అంటూ రాష్ట్ర ప్రజలను శివసేన కోరింది.