: పేలవంగా ముగిసిన బెంగళూరు ఎయిర్ షో... మెగా డీల్స్ లేవు!


ఎలాంటి భారీ డీల్స్ కుదరకుండానే బెంగళూరులో జరుగుతున్న 'ఏరో ఇండియా' ప్రదర్శన ముగిసింది. చివరి రెండు రోజుల్లో 3 లక్షల మందికి పైగా ప్రజలు హాజరై ప్రదర్శనను తిలకించినప్పటికీ, ఒప్పందాల విషయంలో నిరుత్సాహం కలిగిందని ఈ రంగంలోని నిపుణులు వ్యాఖ్యానించారు. ఐదు రోజులపాటు సాగిన 'ఏరో ఇండియా'లో పలు ఒప్పందాలు కుదురుతాయని, మేక్ ఇన్ ఇండియా ప్రచారంలో రక్షణ రంగానికి సంబంధించి ఈ ప్రదర్శన కీలక అడుగని తొలిరోజు ప్రసంగంలో మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పెట్టుబడుల విషయంలో భారత రక్షణ రంగం అందిస్తున్న అద్భుత అవకాశాలను ప్రపంచ కంపెనీలు అందుకుంటాయని భావించినప్పటికీ, ఆ దిశగా అడుగులు పడలేదు. కాగా, ప్రదర్శనకు ఉంచిన విమానాలు, అధునాతన సాంకేతికతను పరిచయం చేస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్ మాత్రం విశేషంగా ఆకట్టుకున్నాయి. 295 భారత, 328 విదేశీ కంపెనీలు తమతమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించాయి. షో రెండో రోజు రెడ్ బుల్స్ విన్యాసకులు ఘోర ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడడం అదృష్టం. చెక్ రిపబ్లిక్ కు చెందిన రెండు విన్యాస విమానాలు గాలిలో ఒకదాన్ని మరొకటి తాకాయి. ఈ ఘటనలో విమానాల రెక్కలు మాత్రం ధ్వంసం కాగా, ఆ విమానాలు సురక్షితంగా నెలకు దిగడంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. ఫ్రాన్స్ కు చెందిన 58, బ్రిటన్ కు చెందిన 48, రష్యాకు చెందిన 41 కంపెనీలు ప్రదర్శనలో భాగం పంచుకున్నాయి.

  • Loading...

More Telugu News