: పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం... హైలైట్స్-2


పార్లమెంటు సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగంలోని హైలైట్స్ ఇవే... * బడ్జెట్ సమావేశాలు సజావుగా జరగాలని కోరుకుంటున్నాం. * పేదలకు మంచి వైద్యం అందించడం కోసం మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపడుతుంది. * మహిళలపై నేరాలు అరికట్టడానికి ప్రతి రాష్ట్రంలో పత్యేక కేంద్రాలు ఏర్పాటు. * దేశంలో పరిశ్రమల ఏర్పాటు కోసం ఆన్ లైన్ విధానంలో అనుమతుల మంజూరు. * సమర్థవంతంగా ప్రభుత్వ పాలనను కొనసాగించేందుకు టెక్నాలజీని వాడుకుందాం. * ప్రభుత్వం చేపట్టిన పథకాలు మంచి ఫలితాలను అందిస్తున్నాయి. * గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకం. * దేశీయంగా, అంతర్జాతీయంగా నల్లధనం నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. * దేశాన్ని గొప్ప తయారీ కేంద్రంగా మార్చేందుకే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం. * మహిళా సాధికారత కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. * మహిళల భద్రత కోసం 'హిమ్మత్' అనే యాప్ ప్రవేశపెట్టాం. * అధికారాన్ని వికేంద్రీకరిస్తాం. దీనివల్ల సత్వర నిర్ణయాలు తీసుకునే వీలు కలుగుతుంది. ప్రభుత్వ నిర్ణయాల్లో జాప్యం లేకుండా ఉంటుంది. * డిజిటల్ ఇండియాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. దీని లక్ష్యం సాంకేతిక పరివర్తన, అభివృద్ధి. * కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో తగ్గింది. * బీమా రంగంలో ఎఫ్ డీఐలను 49 శాతానికి పెంచాం. * ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యత ఇస్తున్నాం. * బిందు, తుంపర సేద్యం, గ్రీన్ హౌస్ లకు ప్రాధాన్యత ఇస్తాం. * ఉపాధి కల్పన, ఉత్పత్తి పెంపు, స్మార్ట్ సిటీల నిర్మాణానికి ప్రాధాన్యత. * త్వరలో ప్రధానమంత్రి ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభిస్తాం. * భూసేకరణలో నష్టపోయిన రైతులకు ఉపాధి కల్పిస్తాం. * కౌలు రైతులకు వ్యవసాయం గిట్టుబాటయ్యేలా యత్నం. * ఈశాన్య రాష్ట్రాల్లో విద్యాభివృద్ధికి కృషి. * ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సకాలంలో ఉపకార వేతనాలు. * 7 శాతానికి పైగా జీడీపీ వృద్ధిరేటుతో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత్. * సమాఖ్య విధానంలో కేంద్ర, రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయడానికే... ప్రణాళిక సంఘం స్థానంలో నీతి అయోగ్ ను ఏర్పాటు చేశాం. * పన్నుల విధానాన్ని సరళీకరిస్తాం.

  • Loading...

More Telugu News