: ఆస్కార్ 'ఉత్తమ నటుడు' ఎడ్డీ రెడ్ మైన్, 'ఉత్తమ నటి' జూలియన్ మోరే
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో 87వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. ఉత్తమ నటుడిగా ఎడీ రెడ్ మైన్ ('ది థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్'), ఉత్తమ నటిగా జూలియన్ మోరే ('స్టిల్ ఎలైస్')లు ఆస్కార్ పురస్కారం అందుకున్నారు. 'ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్' చిత్రానికి నాలుగు విభాగాల్లో, 'వివ్ లాష్', 'బర్డ్ మ్యాన్' చిత్రాలకు మూడు విభాగాల్లో ఆస్కార్ పురస్కారాలు దక్కాయి. ప్రపంచంలోని పలువురు ప్రముఖ నటీ, నటులు ఈ వేడుకకు హాజరయ్యారు.