: టీఎస్ మాజీ డిప్యూటీ సీఎం బాటలో కామినేని శ్రీనివాస్... బెజవాడ ఆస్పత్రిలో రాత్రి బస


ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య బాటలో నడుస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో రాజయ్య సర్కారీ ఆస్పత్రుల్లో రాత్రి బస చేస్తూ వైద్యాధికారుల్లో గుబులు రేపారు. ఆ తర్వాత అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనను తెలంగాణ సీఎం బర్తరఫ్ చేశారు. తాజాగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు, సేవలందించడమే లక్ష్యంగా ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా రాజయ్య తరహా చర్యలకు శ్రీకారం చుట్టారు. నిన్న బెజవాడలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయన రాత్రి బస చేశారు. సర్కారీ వైద్యాలయాల పట్ల ప్రజలకున్న అభిప్రాయాలను చెరిపేస్తామని ఆయన నేటి ఉదయం ప్రకటించారు.

  • Loading...

More Telugu News