: మాజీ భర్తను కలిసిన హాలీవుడ్ అందాల నటి జెన్నిఫర్ లోపేజ్
హాలీవుడ్ అందాల నటి, ఆస్కార్ విజేత జెన్నిఫర్ లోపేజ్ తన మాజీ భర్త మార్క్ ఆంటోనీని కలిశారు. ఈ జంటకు పుట్టిన కవల పిల్లల 7వ పుట్టిన రోజు వేడుక ఇందుకు వేదికయింది. "పార్టీ టైం! హ్యాపీ సెవెన్త్ బర్త్ డే టు ది కోకోనట్స్!!" అని ఆమె సామాజిక మాద్యమం ఇన్ స్టాగ్రాం వేదికపై ఆంటోనీతో కలిసున్న చిత్రాన్ని ఉంచారు. ఏడేళ్ల వైవాహిక జీవితం అనంతరం వీరు 2011లో విడిపోయిన సంగతి తెలిసిందే. చిన్నారుల బాధ్యతను మాత్రం ఇద్దరూ కలసి పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత అమెరికన్ ఐడల్ కు న్యాయనిర్ణేతల్లో ఒకరిగా వున్న కాస్పర్ స్మార్ట్ తో రెండేళ్ల పాటు సహజీవన చేసిన జెన్నిఫర్ గత సంవత్సరం జూన్ లో విడిపోగా, అంటోనీ ప్రస్తుతం ఒక మోడల్ తో డేటింగ్ చేస్తున్నాడు.