: ధోనీకి డబుల్ ధమాకా... మెల్ బోర్న్ లో టీమిండియా, ఢిల్లీలో అతడి జట్టు ‘రాంచీ రేస్’ విజయం
కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని టీమిండియా ఆదివారం మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో చిరస్మరణీయ విజయం సాధించిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ మెగా టోర్నీలో భాగంగా జరిగిన నిన్నటి మ్యాచ్ లో పటిష్టమైన దక్షిణాఫ్రికాను ధోనీ సేన చిత్తు చేసింది. దీంతో ధోనీ పట్టరాని సంతోషంతో గంతులేశాడు. ఆ సంబరాల్లో నుంచి అతడు బయటకు రాకముందే మరో విజయం అతడికి దక్కింది. హాకీ ఇండియా లీగ్ లో అతడు కొనుగోలు చేసిన రాంచీ రేస్, నిన్న ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ముగిసిన ఫైనల్ లో టైటిల్ ను చేజిక్కించుకుంది. పంజాబ్ పై జరిగిన ఫైనల్ పోరులో షూటౌట్ లో రాంచీ రేస్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో అతడి జట్టుకు రూ.2.5 కోట్ల ఫ్రైజ్ మనీ దక్కింది.