: నా చేతిరాత బాగోదు... మార్కులూ అంతంతమాత్రమే: మోదీ


"నా చేతిరాత బాగోదు, పరీక్షల్లో మార్కులు కూడా అంతంతమాత్రమే. పరీక్షల్లో ప్రదర్శన కన్నా, జీవిత గమనంలో ఎలా ఎదిగామన్నది ముఖ్యం" అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 'మన్ కీ బాత్'లో భాగంగా, పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. సాధించిన గెలుపు నుంచి నమ్మకాన్ని పెంచుకోవాలని విద్యార్థులకు ఆయన సూచించారు. "మార్కులు తక్కువగా వచ్చాయని మాత్రమే ఆలోచించవద్దు. అలా ఎందుకు జరిగిందని ఆలోచించాలి. అనారోగ్యం కావచ్చు, బంధువుల వివాహం ఉండొచ్చు, మరింకేదైనా బలమైన కారణం మిమ్మల్ని పరీక్షలకు పూర్తి సన్నద్ధం చేయలేకపోయి ఉండొచ్చు. తదుపరి వాటిని ఎలా అధిగమించాలో ఆలోచించండి" అని అన్నారు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు విభిన్న అంచనాలు ఉంటాయని, తాను మాట్లాడుతున్న విషయాలు కఠినమైనవని, అంత తేలికగా చర్చ ముగియదని వివరించారు. స్టూడెంట్స్ ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళితే విజయం సులువని తెలిపారు.

  • Loading...

More Telugu News