: కోడి కూర కోసం కొట్టుకున్న పోలీసులు... చిత్తూరు జిల్లాలో మంటగలిసిన ‘ఖాకీ’ ప్రతిష్ఠ!
చిత్తూరు జిల్లా పోలీసు శాఖ ప్రతిష్ఠ మరోమారు మంటగలిసింది. మద్యం మత్తు తలకెక్కిన పోలీసులు కోడి కూర కోసం కొట్టుకున్నారు. చిత్తూరు జిల్లా పీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ చంద్ర, కానిస్టేబుల్ చలపతిల మధ్య ఫైటింగ్ జరిగింది. ఈ గొడవలో ఇద్దరికీ గాయాలయ్యాయి. గొడవకు దిగి డిపార్టుమెంటు పరువును గంగలో కలిపిన వారిద్దరూ అంతటితో ఆగకుండా పీలేరు పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. అనంతరం గాయాలకు చికిత్స చేయించుకునేందుకు వారిద్దరూ ఆస్పత్రిలో చేరారు.