: ద్రవ్యరాశి తేడాలే క్యాన్సర్‌ను పట్టిస్తాయ్
బరువులో ఉండే వ్యత్యాసం క్యాన్సర్ కణాలను గుర్తించడంలో పనిని సులభతరం చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. విడి కణాలతో పాటు క్యాన్సర్ డీఎన్‌ఏ వంటి అతిసూక్ష్మ రేణువులను తూచే కొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. షాంఘై జియావో టాంగ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ ప్రయోగాలు సాగుతున్నాయి. మామూలు కణాలకు, క్యాన్సర్ డీఎన్‌ఏ అణువులకు బరువులో తేడా ఉంటుంది. అందువలన ఈ 'తూకం' టెక్నిక్‌ను ఉపయోగిస్తే.. క్యాన్సర్ కణాలను తేలిగ్గా కనుక్కోవచ్చు అనేది వీరి సిద్ధాంతం. నిజంగానే ఈ ఆలోచన ప్రస్తుతానికి సిద్ధాంతదశలోనే ఉంది. తమ ప్రయోగాలకు సహకరించేవారు దొరికితే దీని నిగ్గుతేలుస్తామని అధ్యయనానికి నేతృత్వం వహిస్తున్న 'జా' తెలిపారు .