: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో చీకట్లు... గుంటూరులో నిలిచిన క్రయవిక్రయాలు
గుంటూరులోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో చీకట్లు అలముకున్నాయి. విద్యుత్ బకాయిలు చెల్లించని కారణంగా ట్రాన్స్ కో అధికారులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో నిన్న గుంటూరులోని నల్లపాడు, కొరివిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో విద్యుద్దీపాలు వెలగలేదు. నగరంలోని ఈ రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే ఎక్కువగా భూ క్రయవిక్రయాలు సాగుతాయి. విద్యుత్ సరఫరా లేకపోవడంతో నిన్న రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఈ రెండు కార్యాలయాలు నెలల తరబడి విద్యుత్ బిల్లులు చెల్లించని కారణంగానే వాటికి విద్యుత్ సరఫరా నిలిపివేశామని ట్రాన్స్ కో అధికారులు తెలిపారు.