: ముగిసిన ఇంగ్లండ్ బ్యాటింగ్.... స్కాట్లాండ్ విజయ లక్ష్యం 304 పరుగులు


వరల్డ్ కప్ గ్రూప్-బీలో నేటి తెల్లవారుజామున ప్రారంభమైన మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరు సాధించించి. మొత్తం 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. ఓపెనర్లు మొయిన్ అలీ (128), ఇయాన్ బెల్ (52) లు తొలి వికెట్ కే 172 భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు పడినా, ఇయాన్ మోర్గాన్ (46) బ్యాట్ ఝుళిపించడంతో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. స్కాట్లాండ్ బౌలర్ సోష్ డేవీ నాలుగు వికెట్లు తీసి, ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ ను బెంబేలెత్తించాడు. మరికాసేపట్లో స్కాట్లాండ్ బ్యాటింగ్ ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News