: వరుసగా పడిన ఇంగ్లండ్ వికెట్లు... పట్టు బిగిస్తున్న స్కాట్లాండ్!


వరల్డ్ కప్ మెగాటోర్నీలో భాగంగా నేటి తెల్లవారుజామున ప్రారంభమైన మ్యాచ్ లో ఆరంభంలో ధాటిగానే బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్, తొలి వికెట్ పడిపోయిన తర్వాత ఆ జట్టు బ్యాట్స్ మెన్ వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. జట్టు స్కోరు 172 పరుగులు చేరేదాకా ఒక్క వికెట్ పడకున్నా, ఆ తర్వాత స్వల్ప స్కోరుకే మరో మూడు వికెట్లు కూలాయి. ఇంగ్లండ్ ఓపెనర్ మొయిన్ అలీ సెంచరీతో (128) చెలరేగగా, మరో ఓపెనర్ ఇయాన్ బెల్ (52) కూడా రాణించాడు. జట్టు స్కోరు 172 పరుగుల వద్దకు చేరగానే ఇయాన్ బెల్ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన గ్యారీ బల్లాన్స్, జో రూట్ లు కుదురుకోలేకపోయారు. 201 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్, 203 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లు చేజార్చుకుంది. తొలుత అలీ, బెల్ ల హిట్టింగ్ కు బెంబేలెత్తిన స్కాట్లాండ్ బౌలర్లు ఆ తర్వాత జూలు విదిల్చారు. 41 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ 226 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News