: బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ ప్రమాణ స్వీకారం


బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ త్రిపాఠి ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ తో బాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నితీశ్ తో పాటు 22 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 22 మందిలో 20 మంది మాంఝీ మంత్రి వర్గంలో పని చేసిన వారే కావడం విశేషం. కాగా ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ లు తమ ఇంట వివాహం కారణంగా ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.

  • Loading...

More Telugu News