: చరిత్రను తిరగ రాసిన భారత్...భారీ విజయం


భారత క్రికెట్ జట్టు చరిత్రను తిరగరాసింది. 130 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై టీమిండియా విజయం సాధించింది. గత మూడు వరల్డ్ కప్ లలో సాధ్యం కాని దానిని సుసాధ్యం చేసింది. క్రీడా విశ్లేషకులు, విమర్శకుల నోళ్లు మూయించేలా టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. 2015 వరల్డ్ కప్ ఫేవరేట్లలో ఒకటిగా భావిస్తున్న సౌతాఫ్రికా జట్టును మట్టి కరిపించి తాము డిఫెండింగ్ ఛాంపియన్లమే కాదు, ఛాంపియన్లుగా నిలిచే సత్తా తమకు ఉందని ప్రత్యర్ధులకు హెచ్చరికలు పంపింది. వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్ లో చతికిల పడ్డ భారత జట్టు, పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో పుంజుకుంది. సఫారీలతో జరిగిన మ్యాచ్ లో కూడా అదే ప్రదర్శన పునరావృతం చేసిన టీమిండియా భారీ ఆధిక్యంతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. నిర్ణీత 50 ఓవర్లలో 308 పరుగులు చేసిన భారత జట్టు పరిమితమైన బౌలింగ్ వనరులతో అద్భుతంగా రాణించింది. దీంతో ప్రోటీస్ ను తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. సౌతాఫ్రికా జట్టులో డుప్లెసిస్ (55), డివిలీర్స్ (30) రాణించగా, వారికి అమ్లా (22), మిల్లర్ (22) చక్కని సహకారమందించారు. భారత బౌలర్లలో అశ్విన్ (3) రాణించగా షమి, మోహిత్ శర్మ చెరి రెండు వికెట్లు తీసి చక్కని సహకారమందించారు. దీంతో టీమిండియా 130 పరుగుల తేడాతో విజయం సాధించింది. 137 పరుగులు చేసిన శిఖర్ ధావన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.

  • Loading...

More Telugu News