: సైబర్ వేధింపులతో నిందితులు, బాధితుల్లో నిరాశా, నిస్పృహలు


ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయింది. సామాజిక మాధ్యమాల్లో అకౌంట్ లేదంటే అదో నేరంగా భావిస్తున్నారు యువత. ఈ నేపథ్యంలోనే లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి. దీంతో బాధితులు నిరాస, నిస్పృహల్లో కూరుకుపోతున్నారు. వారిపై వేధింపులకు పాల్పడుతున్నవారు కూడా నిరాశ, నిస్పృహలతో పాటు మద్యానికి బానిసలవుతున్నారని అధ్యయనం తెలిపింది. అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న విస్కన్సిన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యూనివర్శిటీలో భారత సంతతి ప్రొఫెసర్ రంజిత చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. నాలుగు కళాశాలల్లోని 265 మంది విద్యార్థినులను ఇందుకోసం పరిశీలించారు. వీరిలో ప్రతి నలుగురిలో ఒకరు సైబర్ బుల్లీయింగ్ బాధితులేనని తేలింది. సైబర్ బుల్లీయింగ్ లో ఇతరుల సమాచారంలోకి చొరబడటం, అందులో అవాంఛనీయ, లైంగిక, అభ్యంతరకరమైన అసభ్య సమాచారం పెట్టడం చేస్తున్నారని అలాంటి వారు నిరాశ, నిస్పృహలతో మద్యానికి బానిసలవుతున్నారని ఆమె చెప్పారు. అలాగే బాధితులు నిరాశ,నిస్పృహలకు లోనవుతున్నారని ఆమె వెల్లడించారు. ఈ వివరాలు సైబర్ సైకాలజీ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.

  • Loading...

More Telugu News