: శిఖర్ ధావన్ అవుట్... ఆగని పరుగుల వర్షం!
దక్షిణాఫ్రికా బౌలర్లను చెడుగుడు ఆడుకున్న ఓపెనర్ శిఖర్ ధావన్ 137 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. పార్నెల్ వేసిన 44వ ఓవర్ 4వ బంతికి భారీ షాట్ కొట్టబోయి బౌండరీ ముందు ఆమ్లాకు క్యాచ్ ఇచ్చాడు. రహానే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని జోరు మీద వుండగా, అతనికి తోడుగా, సురేష్ రైనా వచ్చి చేరాడు. రైనా సైతం తాను ఆడిన తొలి బంతిని బౌండరీకి పంపి బాదడమే తన లక్ష్యమని చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం భారత స్కోర్ 44 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 266 పరుగుల వద్ద కొనసాగుతోంది. ఆటలో మరో 6 ఓవర్లు మిగిలి ఉండగా, కనీసం 300 పరుగులకు పైనే స్కోర్ ఉంటుందని అంచనా.