: కాంగ్రెస్లో చేరిన 'తీన్ మార్ మల్లన్న'
'తీన్ మార్ మల్లన్న'గా తెలంగాణ యాసను, భాషను ప్రజల్లోకి తీసుకెళ్ళిన నవీన్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లౌకికవాదం ఉన్న పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని ఈ సందర్భంగా పొన్నాల వ్యాఖ్యానించారు. త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తానని, అధిష్ఠానం ఆదేశాల మేరకు నడుచుకుంటానని నవీన్ కుమార్ చెప్పారు.