: ఆస్తి కోసం అన్నను ‘చంపిన’ చెల్లెలు


తన అన్న చనిపోయాడని చెప్పి అతని ఆస్తిని మరొకరికి రిజిస్టర్ చేయించిందో చెల్లెలు. గుంటూరు జిల్లాలో 2010లో జరిగిన ఈ మోసం ఎస్పీ రాజేష్‌ కుమార్‌ పాత కేసులు తోడుతుండగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో రెండేళ్ళ నాడే కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు ముడుపులు తీసుకుని తొక్కిపెట్టినట్టు ఆయన గమనించారు. నిన్న నిందితురాలైన ఎస్తేరు రాణిని అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రావిపాటి జయప్రదకు ప్రభాకరరావు, ఎస్తేరు రాణి సంతానం. వీరికి వారసత్వంగా తల్లి నుంచి రెండున్నర ఎకరాల పొలం లభించింది. ప్రభాకరరావుకు చెందిన ఎకరం పొలాన్ని ఆయన మరణించాడని చెబుతూ, ఎస్తేరు రాణి 2010 జూలై 22న విక్రయించింది. విషయం తెలుసుకున్న ప్రభాకరరావు ఐదేళ్ల నుంచి పోరాడుతుండగా, ఇప్పటికి కేసు ముందుకు కదిలింది.

  • Loading...

More Telugu News