: కలసికట్టుగా ఆడిన ఆఫ్గాన్... లంక లక్ష్యం 233


వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో భాగంగా డునెడిన్‌ లో జరుగుతున్న మ్యాచ్‌ లో శ్రీలంక తన పదునైన బౌలింగ్‌తో ఆఫ్గానిస్థాన్‌ ను 232 పరుగులకు పరిమితం చేసింది. 49.4 ఓవర్లలో ఆఫ్గాన్ ఆటగాళ్లను ఆలౌట్ చేసింది. లంక బౌలర్లలో మలింగ 3, మాథ్యూస్ 3, లక్మల్ 2, ఫెరీరా, హెరాత్ చెరో వికెట్ తీశారు. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకోగా, అజ్గర్ అర్ధ సెంచరీ సాధించాడు. 57 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ తో 54 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరికాసేపట్లో శ్రీలంక చేజింగ్ మొదలుకానుంది. కాగా, ఆఫ్గాన్ జట్టులోని టాప్ -8 ఆటగాళ్లంతా రెండంకెల స్కోర్ చేయడం గమనార్హం. బలమైన లంక బౌలర్లను పసికూనలైన ఆఫ్గన్ కలసికట్టుగా ఎదుర్కొంది. అందరూ స్కోర్ బోర్డు కు ఎన్నో కొన్ని పరుగులు జోడించారు.

  • Loading...

More Telugu News