: రోడ్డు ప్రమాదంలో సినీ నిర్మాత మృతి, దర్శకుడికి గాయాలు
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సినీ నిర్మాత నాగిరెడ్డి మృతి చెందగా, దర్శకుడు మదన్ కు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2013లో విడుదలైన 'పెళ్లి పుస్తకం' చిత్ర నిర్మాతల్లో ఒకరైన పి.నాగిరెడ్డి (33), అతని మిత్రుడు, 'పెళ్లైన కొత్తలో..' దర్శకుడు మదన్ కలసి శనివారం అనంతపురం నుంచి నగరానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ పై వేగంగా వస్తున్న కారు ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టింది. నాగిరెడ్డి అక్కడికక్కడే మరణించగా, మదన్ ను హైటెక్ సిటీలోని హిమగిరి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.