: చెన్నైలో స్టార్ హోటల్ కట్టాలనుకుంటున్న కాంగ్రెస్!
దశాబ్దాలుగా తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినా, ఆ పార్టీ పేరిట కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఒకప్పటి ముఖ్యమంత్రి కామరాజ నాడార్ వీటిని సమీకరించారు. వాటిల్లో ఒకటి చెన్నై నడిబొడ్డులోని తేనాంపేటలో ఉంది. 1960లో కొనుగోలు చేసిన 30 ఎకరాల ఈ స్థలం విలువ ఇప్పుడు కొన్ని వేల కోట్లు. ప్రస్తుతం ఈ మైదానంలో అనేక దుకాణాలు, 'కామరాజర్ అరంగం' తదితరాలు ఉండగా, ఇక్కడ ఒక స్టార్ హోటల్ కట్టాలని కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ యోచిస్తున్నారు. ఇందుకోసం ముంబయికి చెందిన ఒక పారిశ్రామికవేత్తతో రాహుల్‌గాంధీ చర్చలు జరిపినట్టు సమాచారం. ఈ పనుల పర్యవేక్షణ కోసం టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఇళంగోవన్ ఢిల్లీకి వెళ్లారని పార్టీ శ్రేణులు తెలిపాయి.