: మోదీ టీ అమ్మారనడానికి సాక్ష్యం ఉందా?: ఆర్టీఐ కార్యకర్త
ప్రధాని నరేంద్ర మోదీ చిన్నతనంలో రైల్వే ఫ్లాట్ ఫాం మీద కానీ, రైళ్లలో కానీ టీ అమ్మారని చెప్పేందుకు సాక్ష్యం ఏదైనా ఉందా? అని సామాజిక కార్యకర్త తెహసీన్ పూనావాలా రైల్వే బోర్డును సమాచారహక్కు చట్టం ప్రకారం ప్రశ్నించారు. దీనికి రైల్వే శాఖ సమాధానం ఇచ్చింది. అలాంటి రికార్డులు ఏవీ లేవని స్పష్టం చేసింది. ఆయన టీ అమ్మారనడానికి అధికారికంగా జారీ చేసిన పాస్ కానీ, అనుమతి కానీ లేదని స్పష్టం చేసింది. రైల్వే లోని టూరిజం అండ్ కేటరింగ్ డైరెక్టరేట్ పరిథిలో గల టీజీ3 బ్రాంచ్ వద్ద అలాంటి ఆధారాలేవీ లేవని రైల్వే శాఖ స్పష్టం చేసింది. కాగా, తెహసీన్ పూనావాలా కాంగ్రెస్ మద్దతుదారు అని తెలుస్తోంది.