: ఆ నలుగురు హీరోయిన్లతో వరుణ్ ధావన్ రొమాన్స్ బాగా పండిందట!
యువహీరో వరుణ్ ధావన్ కొత్త సినిమా 'బదలాపూర్'పై బాలీవుడ్ లో పెద్ద చర్చే నడుస్తోంది. ప్రముఖ నిర్మాత డేవిడ్ ధావన్ కుమారుడిగా సినీ రంగంలో అడుగుపెట్టిన వరుణ్ 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్', 'మే తెరా హీరో', 'హంప్టీ శర్మకీ దుల్హన్' సినిమాల్లో తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. తాజాగా తన భార్యను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకునే కథాంశంతో నిర్మితమైన బదలాపూర్ సినిమాలో నలుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేశాడు. బాలీవుడ్ హాట్ గాల్స్ గా పేరొందిన యామీ గౌతమ్, హుమా ఖురేషీ, రాధికా ఆప్టే, దివ్యా దత్తాలతో హాట్ హాట్ గా నటించాడు. వారి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండిందని సీనీ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.