: అతను అచ్చం నాలాగే ఉంటాడు...అదే నచ్చుతుంది!: అనిల్ కుంబ్లే
రవిచంద్రన్ అశ్విన్ అచ్చం తనలాగే ఆడతాడని టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ, అశ్విన్ బౌలింగ్ విధానం, అతనిలో క్రీడాస్పూర్తి, ప్రశాంతంగా ఉండే తత్వం అచ్చం తనను పోలి ఉంటాయని అన్నాడు. టీమిండియాకు ఆడేటప్పుడు తాను కూడా అలాగే ఉండేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. అశ్విన్ బంతితో రాణించి, బ్యాటుతో జట్టుకు న్యాయం చేయగలడని ఆయన సూచించారు. మిగిలిన బౌలర్లతో పోల్చుకుంటే అశ్విన్ సమర్ధవంతమైన బ్యాట్స్ మన్ అని ఆయన కొనియాడారు.