: శతాధిక ఆయుష్మాన్‌ భవ!


'శతాయుష్మాన్‌ భవ' అంటూ నిండు నూరేళ్లు జీవించమని పెద్దలు దీవిస్తుంటారు. అంటే.. మన ప్రమాణాల్లో నూరేళ్లు బతకడం అనేదే గొప్ప విషయం. అయితే జపాన్‌లోని క్యోటాంగో నగరంలో.. వందా అంటే అంతేనా అని వారు చప్పరించేస్తారు. ఇక్కడి జనాభా 60 వేల మంది అయితే.. 95 శాతం మంది 100 ఏళ్లకు పైబడిన వారే. ఈ నగరంలో మాత్రం ఎక్కువ మంది 'సెంచరీ నాటౌట్‌'గా ఎలా ఉండగలుగుతున్నారు. వారి అలవాట్లు, ఆహార విహారాల వివరాల్ని ఓ గ్రంథంగా తయారుచేస్తే.. సెంచరీ కొట్టే ముచ్చట ఉన్న ఇతర ప్రాంతాల వారికి గైడ్‌లాగా ఉపయోగపడుతుందనేది.. స్థానికంగా అధికార్లకు ఆలోచన వచ్చింది. ప్రస్తుతం ఆ పనిలో పడ్డారు. ఈ పనిలో ఉన్నప్పుడు.. 116 ఏళ్లు దాటిన జిరోయ్‌మోన్‌ కిమురా వారికి ఏం చెబుతున్నాడంటే.. తాను ధూమపానానికి దూరమట. 80 శాతం మించి తినడట. తక్కువ తిను ఎక్కువకాలం బతుకు అనేదే తన సిద్ధాంత మంటున్నాడు.

ఈ పుస్తకం గనుక మార్కెట్లోకి విడుదల అయితే.. సక్సెస్‌ సాధించిన గొప్పవాళ్ల జీవితలక్షణాలనుంచి రూపొందిన సెవెన్‌ హేబిట్స్‌ ఆఫ్‌ హైలీ ఎఫెక్టివ్‌ పీపుల్‌ లాగానే.. ఇది కూడా హాట్‌ కేకులా అమ్ముడవుతుందనడంలో ఆశ్చర్యం లేదు. బతుకంటే తీపి ఉండనిదెవరికి?

  • Loading...

More Telugu News