: ఉద్యోగులను రమ్మంటే వచ్చే పరిస్థితి లేదు!: ఎంపీలతో బాబు!
పరిపాలనను ఏపీకి మారుద్దామంటే, ఉద్యోగులు వచ్చే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. నేడు జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులను రాజధాని ప్రాంతానికి రమ్మంటే, వాళ్ళు ఇళ్లు నిర్మించాలని కోరుతున్నారని, ఇప్పటికిప్పుడు 20 వేల గృహాలు సిద్ధం చేయడం కష్టమని ఆయన అన్నారు. ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామని కేంద్రమే హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన, రాజధానికి కేంద్రం ఇస్తామంటున్న సాయం సరిపోదని, రూ.5 వేల కోట్లు ఏ మూలకూ చాలవని అన్నట్టు తెలిసింది.