: మరో హాలీవుడ్ సినిమాలో నటించనున్న ఇర్ఫాన్ ఖాన్


బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ను మరో హాలీవుడ్ ఆఫర్ వరించింది. గతంలో 'లైఫ్ ఆఫ్ పై'లో హీరోగా హాలీవుడ్ లో రంగప్రవేశం చేసిన ఇర్ఫాన్ ఖాన్ కు టామ్ హాంక్స్ సినిమాలో కీలక పాత్ర పోషించే అవకాశం లభించింది. ప్రపంచ ప్రఖ్యాత రచయిత డాన్ బ్రౌన్ రాసిని క్రైమ్ ధ్రిల్లర్ నవల 'ఇన్ ఫెర్నో'ని సినిమాగా నిర్మిస్తున్నారు. 'ఇన్ ఫెర్నో'లో టామ్ హాంక్స్ లాంటి నటుడి సరసన ఇర్ఫాన్ నటించడం అతని కెరీర్ కు మరింత ఉపయోగపడనుంది. కాగా, ఇర్ఫాన్ ఖాన్ 'స్లమ్ డాగ్ మిలియనీర్' సినిమా ద్వారా హాలీవుడ్ లో అరంగేట్రం చేశాడు. అనంతరం 'లైఫ్ ఆఫ్ పై', 'అమేజింగ్ స్పైడర్ మేన్', వంటి సినిమాల్లో నటించారు. ఆయన తాజాగా నటించిన 'జురాసిక్ వరల్డ్' ఈ ఏడాది జూలై 12న విడుదల కానుంది.

  • Loading...

More Telugu News