: రేపటి మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా: ఆగార్కర్
రేపు మెల్ బోర్న్ లో జరగనున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని టీమిండియా మాజీ పేసర్ అజిత్ ఆగార్కర్ తెలిపాడు. ముంబైలో ఆయన మాట్లాడుతూ, భారత్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుందని అన్నాడు. పాక్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసిందని ప్రశంసించాడు. రేపు జరగనున్న మ్యాచ్ వరల్డ్ కప్ లోని రెండు బలమైన జట్ల మధ్య జరగబోతుందని పేర్కొన్నాడు. రేపటి మ్యాచ్ కు రెండు జట్లు ఫేవరేట్లే అని పేర్కొన్న ఆగార్కర్, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సమానంగా రాణించిన జట్టే విజేతగా నిలుస్తుందని చెప్పాడు. అయితే ప్రోటీస్ కంటే టీమిండియా బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉందని చెప్పాడు. బౌలింగ్ లో ప్రోటీస్ దే పైచేయని, మైదానంలో పాదరసంలా కదలడం సౌతాఫ్రికా బలమని ఆగార్కర్ అభిప్రాయపడ్డాడు.