: తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఆర్థికసాయం: కేసీఆర్
తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఎలాంటి ఆలస్యం లేకుండా కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందజేస్తామని తెలిపారు. దాంతో పాటు కుటుంబంలో ఒకరికి తప్పకుండా ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై సదరు జిల్లాల మంత్రులు, కలెక్టర్లు సమీక్ష చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే కుటుంబంలో ఎవరికి ఉద్యోగం కల్పించాలన్న విషయంపై కుటుంబసభ్యులే నిర్ణయించుకోవాలన్నారు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం వద్దంటే ప్రత్యామ్నాయ ఉపాధి చూపుతామని చెప్పారు. ఇక బీడీ కార్మికులకు నెలకు రూ.1,000 భృతి అందించే కార్యక్రమం మార్చి 1 నుంచి ప్రారంభమవుతుందని కేసీఆర్ వివరించారు.