: నక్షత్రం అదిరింది! ఇద్దరు చంద్రుల మధ్య 'బడ్జెట్' పోటీ


ఆంద్రప్రదేశ్ ,తెలంగాణ ముఖ్యమంత్రులు మార్చి12వ తేదీపై మక్కువ పెంచుకుంటున్నారు. అదే రోజున అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. దీనికి కారణం 12వ తేదీన ఉన్న ముహూర్త బలమేనట. ఆరోజు బడ్జెట్ ప్రతిపాదిస్తే రాష్ట్రానికి అభివృద్ధి, ప్రగతి ఉంటాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితంగా ఉండే జ్యోతిష్కులు చెప్పారట. ఏపీ ముఖ్యమంత్రి బాబుకు కూడా ఇదే సమాచారం వెళ్ళింది. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాలు ఒకేసారి శాసనసభ జరపరాదని లాంఛనంగా ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ఎవరు వెనక్కు తగ్గుతారో తెలియక, ఎవరికి ఏర్పాట్లు చేయాలో తెలియక అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఒకవేళ రెండు ప్రభుత్వాలు ఒకేసారి సభ నిర్వహిస్తే, స్థలాభావం, భద్రత తదితర సమస్యలు వస్తాయని వారు ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News