: విజయవాడలో బాబు కార్యాలయం మెరుగుల కోసం రూ.6.5 కోట్ల ఖర్చు!
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో ఉన్న సమయంలో ఆఫీసు కార్యకలాపాల కోసం వినియోగించడానికి వీలుగా ఏర్పాటు చేస్తున్న క్యాంప్ కార్యాలయానికి రూ.6.5 కోట్లు ఖర్చు పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజినీర్ కార్యాలయంలో చంద్రబాబు ఆఫీస్ ను తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ భవంతికి అవసరమైన మార్పుచేర్పులు చేసి, పూర్తి స్థాయి హంగులు అద్దేందుకు భారీగా ఖర్చు పెట్టాలని అంచనా వేసిన అధికారులు దానికి అనుగుణంగా ప్రతిపాదనలు పంపాలని ఆదేశాలు ఇచ్చారు. కార్యాలయంలో ఏర్పాట్లలో భాగంగా ఫర్నిచర్, సాంకేతిక పరిజ్ఞానం మొదలైన సదుపాయాలూ కల్పించనున్నారు.