: భూసేకరణ బిల్లు ఆర్డినెన్స్ పై రాహుల్ నిరసన... హజారేకు ఆహ్వానం
భూసేకరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై కాంగ్రెస్ మండిపడుతోంది. ఈ క్రమంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నెల 23న నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరుగుతుందని ప్రకటన చేసింది. రెండు రోజుల పాటు జరిగే ఈ నిరసనలో పాల్గొనాలంటూ సామాజిక ఉద్యమకర్త, గాంధేయవాది అన్నా హజారేను ఆహ్వానించింది. ఈ ఆర్డినెన్స్ లో చేసిన రైతు వ్యతిరేక సవరణలను ఉపసంహరించుకోవాలని చేస్తున్న నిరసనలో ఆయన పాల్గొనే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ అంటోంది. కాగా ఈ ఆర్డినెన్సును కేంద్రం ఉపసంహరించుకోకుంటే నిరవధిక దీక్ష చేపడతానని కొన్ని రోజుల కిందట హజారే కేంద్రాన్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే.