: ఎంసెట్ లేకుంటేనే విద్యార్థులకు ఉపయోగం: ఎంపీ హరిబాబు


ఎంసెట్ ప్రవేశ పరీక్ష లేకుండా ఉంటేనే విద్యార్థులకు మేలు జరుగుతుందని విశాఖ ఎంపీ, ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు హరిబాబు అభిప్రాయపడ్డారు. ఇంటర్ మార్కులు ఆధారంగానే ఎంసెట్ అడ్మిషన్లు నిర్వహించాలని ఆయన కోరారు. ఒకవేళ ఏపీలో ఎంసెట్ నిర్వహించినప్పటికీ అడ్మిషన్లు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని హరిబాబు సూచించారు. ఇదిలాఉంటే ఏపీలో ఎంసెట్ నిర్వహణపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు తెలంగాణలో ఎంసెట్ షెడ్యూల్ విడుదలైంది.

  • Loading...

More Telugu News