: ఏడాదిలో ఢిల్లీకి ఉచిత వైఫై సేవలు: కేజ్రీవాల్
ఢిల్లీలో అధికారం చేపట్టిన వారం రోజుల్లోనే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీ ఆమ్ ఆద్మీ ఇచ్చిన మంచినీరు, విద్యుత్ ఛార్జీలు, ఉచిత వైఫై హామీలను నెరవేర్చేందుకు దృష్టి పెట్టారు. ఢిల్లీలోని గారడెన్ టూరిజం ఫెస్టివల్ వార్షికోత్సవంలో పాల్గొన్న కేజ్రీ మాట్లాడుతూ, విద్యుత్, మంచినీరు అంశాలపై తమ టీమ్ బ్లూ ప్రింట్ తయారు చేస్తోందని చెప్పారు. త్వరలోనే విద్యుత్ ఛార్జీల తగ్గింపు, మంచినీటికి సంబంధించి శుభవార్త ప్రకటిస్తామన్నారు. గతేడాది 49 రోజుల పాలనలో అనుసరించిన పరిపాలన తరహాలో పనిచేస్తున్నామని చెప్పారు. అంతేగాక ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఉచిత వైఫై సౌకర్యాన్ని కూడా అమలుచేసే పనిలో ఉన్నామని, ఇందుకు ఓ సంవత్సరం పడుతుందని పేర్కొన్నారు. దాని గురించి తన పిల్లలు కూడా అడుగుతున్నారని కేజ్రీ చెప్పారు.