: ఇంట్లో అందరినీ తెలుగు పేర్లతోనే పిలుచుకుందాం: వెంకయ్యనాయుడు
ఇంట్లోని కుటుంబ సభ్యులందరినీ తెలుగు పేర్లతోనే పిలుచుకుందామని తెలుగు ప్రజలకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. విజయవాడలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో పాల్లొన్న ఆయన తెలుగు భాష ప్రాభవం కోల్పోతున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. పరభాషా వ్యామోహంలో పడిపోయిన తెలుగు ప్రజలు తెలుగు భాష మాధుర్యాన్ని మరచిపోతున్నారన్నారు. తెలుగు భాషలోని మాధుర్యం... లోతుగా వెళితేనే తెలుస్తుందని ఆయన చెప్పారు. మన సంస్కృతీ సంప్రదాయాలను మనమే కాపాడుకోవాలన్నారు. తెలుగు రచనలను ఇతర భాషల్లోకి అనువదించాలని రచయితలకు పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి పాఠశాలలో తెలుగు భాష బోధనను తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందన్నారు.