: ఏపీకి ప్రత్యేక హోదా రాకుంటే... పదవిలో ఉన్నా లేనట్టే: అశోక గజపతి రాజు సంచలన వ్యాఖ్య


ఏపీకి ప్రత్యేక హోదా సాధనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక గజపతి రాజు కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీకి ప్రత్యేక హోదా సాధించి తీరతామని ప్రకటించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించకుంటే తాను పదవిలో ఉన్నా లేనట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీకీ ప్రత్యేక హోదా కల్పించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కేంద్రానికి రాసిన లేఖను కాంగ్రెస్ సీఎంలే వ్యతిరేకిస్తున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన ఆయన ‘స్కాముల కల్చర్ నుంచి స్కిల్ కల్చర్ రావడానికి కొంత సమయం పడుతుంది’’ అని దెప్పిపొడిచారు.

  • Loading...

More Telugu News