: ఐదేళ్లు... 144 నేరాలు... 1,535 ఏళ్ల జైలు శిక్ష: జోహన్నెస్ బర్గ్ కోర్టు తీర్పు


‘‘నేరం... ఒకటైనా, వందైనా... శిక్ష ఒక్కటే’’ ఇది తెలుగు సినిమాలో డైలాగు మాత్రమే. దక్షిణాఫ్రికాలో మాత్రం చెల్లదు. ఎందుకంటే, ఆ దేశంలో ఎన్నిసార్లు నేరం చేస్తే అన్ని సార్లు శిక్షలు అమలు చేస్తారట. ఇందుకు నిదర్శనంగా ఆ దేశ నగరం జోహన్నెస్ బర్గ్ లోని ఓ కోర్టు, వరుస నేరాలకు పాల్పడ్డ నిందితుడికి 1,535 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఒక నేరస్థుడికి ఇంత పెద్ద శిక్షా అని మనమేం కనికరం చూపాల్సిన పనిలేదు. ఎందుకంటే, మొరేక్ అనే 35 ఏళ్ల నడి వయస్కుడి నేరాల చిట్టా చూస్తే దిమ్మ తిరగక మానదు. కేవలం ఐదంటే ఐదేళ్లలో అతగాడు 144 నేరాలకు పాల్పడ్డాడు. ఇందులో 29 అత్యాచారాలు కూడా ఉన్నాయి. దక్షిణాఫ్రికాలోనే అత్యంత క్రూరమైన నేరాలకు పాల్పడిన మొరేక్ కు 29 అత్యాచారాలకు సంబంధించి 29 సార్లు జీవిత ఖైదు, 360 దొంగతనాలకు సంబంధించిన జైలు శిక్ష అన్నీ కలుపుకునే న్యాయమూర్తి ఈ భారీ శిక్షను ప్రకటించారు.

  • Loading...

More Telugu News