: తుని వెంకటేశ్వరస్వామి ఆలయంలో వెండి చోరీ
బంగారు, వెండి ధరలు ఆకాశాన్నంటడంతో దొంగతనాలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా దేవాలయాల్లో దేవుడి బంగారం, వెండిని ఎత్తుకుపోతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా తుని పాతబజారులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. దేవుని సింహాసనంపై ఉన్న 15 కిలోల వెండిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. వెంటనే ఆలయ పూజారులు పోలీసులకు సమాచారం అందించారు.