: మెల్ బోర్న్ వారికి సొంతగడ్డ కిందే లెక్క... టీమిండియా బలంపై సఫారీల బౌలింగ్ కోచ్ వ్యాఖ్య


వరల్డ్ కప్ లో భారత్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటిదాకా కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన భారత జట్టుపై ఇంటాబయటా ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. స్వపక్షం నుంచే కాక ప్రత్యర్థి జట్ల నుంచి కూడా టీమిండియా బలాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. టీమిండియాను అంత తక్కువగా అంచనా వేయలేమని ఇప్పటికే ఆసీస్ ప్రకటించగా, తాజాగా సఫారీ జట్టు కూడా టీమిండియాను చూసి బెంబేలెత్తుతోంది. రేపు టీమిండియాతో ఆ జట్టు తలపడనున్న నేపథ్యంలో సఫారీల బౌలింగ్ కోచ్ అలెన్ డోనాల్డ్ నిన్న కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇరు జట్ల మధ్య జరగనున్న మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) టీమిండియాకు సొంత గడ్డ కిందే లెక్క అని ఆయన ప్రకటించాడు. సొంతగడ్డపై భారత ఆటగాళ్ల మెరుగైన ప్రదర్శనను గుర్తు చేస్తున్న ఆయన, ఆ జట్టుతో కాస్త జాగ్రత్తగా మసలుకోవాల్సిందేనని సఫారీలకు హెచ్చరికలు జారీ చేశాడు. మెల్ బోర్న్ లో పెద్ద సంఖ్యలో అభిమానులున్న భారత్ ను నిలువరించడం అంత సులువు కాదని ఆయన వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News