: కోహ్లీ ఫేస్ బుక్ ఫాలోయర్ల సంఖ్య 2 కోట్లు... సచిన్ తర్వాతి స్థానం అతడిదే!
టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానుల ఆదరణలో దూసుకెళుతున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యంత అభిమానుల ఆదరణ కలిగిన క్రికెటర్ గా ఎదిగాడు. తన ఫేస్ బుక్ లో 2 కోట్ల మంది ఫాలోయర్లతో కోహ్లీ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ప్రవేశంతో ఆయా ఖాతాలకు వెల్లువెత్తుతున్న అభిమానుల ఆదరణనే సదరు క్రీడాకారుల జనాదరణకు గీటురాయిగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మైదానానికి వీడ్కోలు పలికిన సచిన్ టెండూల్కర్ ఫేస్ బుక్ ఖాతాకు ఇప్పటికీ అభిమానులు పోటెత్తుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఫేస్ బుక్ ను 2.47 కోట్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు. సచిన్ తర్వాత స్థానం కోహ్లీదే.